Thursday, March 6, 2025
Homeనేరాలు-ఘోరాలుAccident: కూలీలతో వెళ్తున్న ట్రాక్టరును ఢీకొన్న లారీ, స్పాట్లోనే ఇద్దరు మృతి

Accident: కూలీలతో వెళ్తున్న ట్రాక్టరును ఢీకొన్న లారీ, స్పాట్లోనే ఇద్దరు మృతి

వైయస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో గురువారం ఘోరం ప్రమాదం(Accident) జరిగింది. చిలమకూరు వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదు మందికి గాయాలయ్యాయి.

- Advertisement -

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని, ట్రాక్టరును తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై మిగిలిన వారిని అడిగి తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News