Friday, March 14, 2025
Homeనేరాలు-ఘోరాలుAccident:హోలీ రోజు ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

Accident:హోలీ రోజు ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హోలీ పండుగ రోజు పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన మైదుకూరులోని కేశ లింగాయ పల్లి వద్ద చోటుచేసుకుంది. టీవీఎస్ స్కూటర్ ను లారీ బలంగా ఢీకొట్టింది.

- Advertisement -

ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు దంపతులు చలమయ్య, లక్ష్మీ దేవిగా గుర్తించారు. పొలం పనులు ముగించుకుని బైక్ లో తమ కుమారునితో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురు మైదుకూరుకు వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News