Saturday, April 12, 2025
Homeనేరాలు-ఘోరాలుSankarapatnam: కాసేపట్లో కూతురి వివాహం ఈలోగా మరణించిన తండ్రి

Sankarapatnam: కాసేపట్లో కూతురి వివాహం ఈలోగా మరణించిన తండ్రి

విషాదంలో పెళ్లి కుటుంబం

కూతురు, వివాహం రోజే ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన అందరినీ షాక్ లో ముంచింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, అంబాల్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని సమీప బంధువులు,గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం ఆదివారం కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో జరగవలసి ఉండగా, రాములు కుటుంబ సభ్యులతో కలిసి, వివాహ ఏర్పాట్లను చేస్తున్న క్రమంలో, చాతిలో నొప్పి అంటూ ఒకేసారి కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు, హుటాహుటిన, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి రాములు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాములు మృతితో శుభకార్యం జరగవలసిన ఇంట్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో అంబాలాపూర్ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News