Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుSC: కవిత కేసు 3 వారాల పాటు వాయిదా

SC: కవిత కేసు 3 వారాల పాటు వాయిదా

కవిత పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి, విచారించటం, పొద్దు పోయాక విచారణను కొనసాగించటంతో పాటు వీడియోకాల్ లో విచారించటం లేదా ఇంట్లోనే విచారించటం వంటివి ఈడీ అధికారులు విస్మరిస్తున్నారంటూ కవిత న్యాయపోరాటం చేస్తున్నారు.  అయితే ఈ కేసుపై మొత్తం వాదనలు విన్న ధర్మాసనం,  మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కవిత తరపున సుప్రీంలో వాదిస్తున్నారు.

- Advertisement -

జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. అయితే మ‌హిళ‌ల‌ను ఈడీ ఆఫీసుకు పిలిపించి విచార‌ణ చేయటంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సతీమణి న‌ళినీ చిదంబ‌రం వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది.  కవిత తరపున కోర్టులో వాదించిన కపిల్.. అసలు కవిత నిందితురాలే కాన‌ప్పుడు విచార‌ణ‌కు ఎలా పిలుస్తారని అడిగారు.  పైపెచ్చు..క‌విత‌కు ఇచ్చిన‌ ఈడీ స‌మ‌న్లను ర‌ద్దు చేసి, అవసరమైతే ఆమె ఇంటి వ‌ద్దే విచార‌ణ జ‌ర‌పాల‌ని కపిల్ సిబాల్ ధర్మాసనానికి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News