ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుగా ఉంటే వెయ్యి రూపాయలు జరిమాను తప్పదని ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసిపి సంపత్ కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి హెచ్ శ్రీనివాసులు వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో సందర్భంగా మెట్టుగూడ ఆలుగడ్డ బావి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏసిపి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఫ్రీ లెఫ్ట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.
- Advertisement -
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ కలిగి ఉంటే వాహనదారులకు అడ్డుగా ఉండకూడదని, ఒకవేళ ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుగా ఉంటే 1000 జరిమానా తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.