Monday, November 17, 2025
Homeనేరాలు-ఘోరాలుMurder: ప్రియుడి కోసం భర్తను బావతో చంపించిన మహిళ.. ఆ చిన్న పొరపాటే పట్టించింది

Murder: ప్రియుడి కోసం భర్తను బావతో చంపించిన మహిళ.. ఆ చిన్న పొరపాటే పట్టించింది

Criminal’s Wife Hires Lover to Kill Him: భర్త వేధింపులు తట్టుకోలేక, ప్రియుడితో కలిసి జీవించాలని ఓ మహిళ చేసిన తప్పు చిన్న పొరపాటు వల్ల బయటపడింది. ఢిల్లీలో జరిగిన ఈ హత్య కేసు విచారణలో అనేక మలుపులు, నేర చరితలు ఉన్నాయి. ఒక నేరగాడి భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను కిరాయి హంతకులతో చంపించి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడింది. కానీ చివరికి ఒక చిన్న పొరపాటే ఆమె ప్లాన్‌ను బయటపెట్టి, కటకటాల వెనక్కి నెట్టింది.

- Advertisement -

ఇదీ జరిగింది..

చనిపోయిన వ్యక్తి పేరు ప్రీతమ్ ప్రకాష్. ఇతడిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. భార్య సోనియాతో కలిసి జీవించేవాడు. అయితే, ప్రీతమ్ తరచుగా డ్రగ్స్‌కు బానిసై సోనియాను శారీరకంగా హింసించేవాడు. అతడితో డ్రగ్స్, నేరపూరిత చర్యలను మాన్పించడానికి ప్రయత్నించి ఆమె విఫలమైంది.

ఈ క్రమంలోనే 2023లో సోషల్ మీడియా వేదికగా ఆమెకు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రోహిత్‌తో పరిచయం ఏర్పడింది. అతడికీ నేరచరిత ఉంది. భర్త వేధింపులు భరించలేకపోయిన సోనియా, తన ప్రియుడు రోహిత్‌తో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్లాన్ వేసింది.

గతేడాది జులైలో భర్తతో గొడవపడి హర్యానాలోని సోనీపత్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లింది సోనియా. క్యాబ్‌లో రోహిత్ ఆమెను దిగబెట్టడానికి వెళ్లాడు. ప్రయాణంలో ఉండగా, తన భర్త ప్రీతమ్‌ను చంపమని రోహిత్‌ను సోనియా అడిగింది. తాను ఆ పని చేయలేనని, కానీ రూ.6 లక్షల రూపాయిలు ఇస్తే కిరాయి రౌడీలతో ప్రీతమ్‌ను చంపవచ్చని సలహా ఇచ్చాడు. అంత డబ్బు తన దగ్గర లేదని ఆ ప్రయత్నం విరమించుకుంది సోనియా.

అక్క భర్తతో మరోసారి..

జులై 5న భార్య సోనియాను తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రీతమ్ సోనీపత్ వెళ్లాడు. అప్పుడు కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్తను ఎలాగైనా చంపాలని ఆమె నిర్ణయించుకుంది. దీనికోసం తన అక్క భర్త విజయ్‌తో రూ.50,000లకు డీల్ కుదుర్చుకుంది. ఆ రాత్రి భర్తను అక్కడే ఉండమని చెప్పింది. పథకం ప్రకారం, విజయ్ తన స్నేహితులతో కలిసి ప్రీతమ్‌ను హత్య చేసి, అతని మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశాడు.

పట్టించిన ఫోన్..

హత్య తర్వాత, సోనియా పోలీసులకు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు లేకుండా చేయడానికి, ప్రీతమ్ ఫోన్‌ను నాశనం చేయమని తన ప్రియుడు రోహిత్‌కు చెప్పింది. కానీ ఇక్కడే ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రోహిత్ ఆ ఫోన్‌ను ధ్వంసం చేయకుండా అతడి వద్దే పెట్టుకున్నాడు.

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ప్రీతమ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రోహిత్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో రోహిత్ భయపడిపోయి, సోనియాతో తన అక్రమ సంబంధాన్ని, హత్య ప్రణాళికను మొత్తం బయటపెట్టాడు. దీంతో పోలీసులు వెంటనే సోనియాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ కటకటాల వెనక్కు వెళ్లారు. విజయ్ ఇప్పటికే వేరే కేసులో జైలులో ఉండగా, పోలీసులు ఈ కేసులో కూడా అతడిని విచారిస్తున్నారు. అతడు సోనియాతో అఫైర్ నడుపుతూనే మరో మహిళను ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad