Man Stabs Woman At Bus Stop, Wipes Hands On Her Scarf: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు, నడిరోడ్డుపై బస్ స్టాప్‌లో నిలబడిన ఓ యువతిని ఓ ఉన్మాది అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. మృతురాలిని రీతూ భండార్కర్ (23)గా, నిందితుడిని రోషన్ ధర్వేగా పోలీసులు గుర్తించారు. వన్ సైడ్ లవ్ వ్యవహారమే ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ హత్యకు సంబంధించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు రోషన్… రీతూ మెడపై, గొంతుపై కత్తితో పదే పదే పొడుస్తున్నా, చుట్టూ ఉన్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా, నిలబడి తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతోంది.
ALSO READ: Model Death: 21 ఏళ్ల మోడల్ మృతి.. ఒంటి నిండా గాయాలు! ఆసుపత్రి ముందు పడేసి ప్రియుడు పరార్
ఆ వీడియోలో నిందితుడు రోషన్, “ఐదేళ్లుగా నాతో ఉంది. చావుబతుకుల్లో కలిసే ఉన్నాం. ఇప్పుడు నన్ను మోసం చేస్తోంది. నన్ను చంపడానికి ఆమె, ఆమె సోదరులు అబ్బాయిలను పంపించారు” అని బిగ్గరగా అరవడం వినిపించింది. అక్కడే ఉన్న ఓ మహిళ “ఎందుకు చంపుతున్నావ్?” అని అడగ్గా, “ఆమె బతుకుతుందిలే.. పోలీసులకు ఫోన్ చేసి తీసుకెళ్లండి” అని వాడు బదులివ్వడం గమనార్హం.
ALSO READ: Lawyer Arrested: రేప్ కేసులో రాజీ కోసం పిలిచి.. క్లయింట్‌పై అత్యాచారం చేసిన న్యాయవాది
పోలీసుల వివరాల ప్రకారం, బైహార్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేసే రీతూ, మంగళవారం పనికి వెళ్లేందుకు అమ్‌గావ్ ఫాటా బస్ స్టాప్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తోంది. లిఫ్ట్ అడిగి బైక్‌పై అక్కడికి చేరుకున్న రోషన్, ఆమెతో కాసేపు మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, వెంటనే కత్తి తీసి దాడి చేశాడు. రక్తపు మడుగులో రీతూ కుప్పకూలిన తర్వాత, ఆమె చున్నీతోనే తన చేతులకు అంటిన రక్తాన్ని తుడుచుకున్నాడు.
దాడి అనంతరం, కొందరు గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చారు. ఈ హత్య వార్త తెలియగానే వందలాది మంది గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. నిందితుడిని ఉరితీయాలని, అతని ఇంటిని కూల్చివేయాలని, బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ALSO READ: Student Suicide: ఫీజు కట్టలేదని పరీక్షకు అనుమతించని కాలేజీ.. అక్కడే నిప్పంటించుకొని విద్యార్థి మృతి!


