Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుShocking: 233 దాటిన మృతుల సంఖ్య, 900 మందికి గాయాలు.. ఘోర రైలు ప్రమాదం

Shocking: 233 దాటిన మృతుల సంఖ్య, 900 మందికి గాయాలు.. ఘోర రైలు ప్రమాదం

మూడు రైళ్లు ఒకటికొకటి ఢీకొట్టుకోవటంతో ఒరిస్సాలో నిన్న రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోల్కత్తా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో 233 మంది ఇప్పటికే మరణించారు, క్షతగాత్రుల సంఖ్య వందలకొద్ది ఉండగా ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ రైలు బోగీలు కొన్ని పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయి. వీటిని షాలిమార్-చెన్నై రైలు ఢీ కొట్టింది. ఈలోగా వచ్చిన గూడ్స్ రైలు కోరమండల్ రైలును ఢీ కొట్టడంతో అతి భారీ ప్రమాదం జరిగి, ప్రమాద తీవ్రత ఊహించనంత పెరిగింది. ప్రమాదం నిన్న రాత్రి జరిగినప్పటికీ ఇంకా ఒక బోగిలోని వారు అందులోనే చిక్కుకుని ఉండగా, వారిని వెలికి తీసే పనులు సాగుతున్నాయి.

- Advertisement -

మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. రాత్రి చీకటి కావటంతో సహాయక చర్యలు చేపట్టడంలో పలు సమస్యలు తలెత్తి, తక్షణం సహాయ-సహకారాలు అందకపోవటంతో మృతుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది, గాయపడ్డ వారు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. అయితే ఈ రైళ్లలో మొత్తం 900 మంది కంటే ఎక్కువమంది ప్రయాణికులు ఉండగా, మృతులు, క్షతగాత్రులు ఎవరెవరనే విషయాలపై పూర్తిగా స్పష్టత వచ్చేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News