Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుKukatpally murder case: కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు..!

Kukatpally murder case: కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు..!

Murder case of Kukatpally: కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మైనర్ బాలుడు. క్రైమ్ వీడియోలను చూసి, వాటి నుండి ప్రేరణ పొంది పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. 10వ తరగతి చదువుతున్న దశలోనే నేరపూరిత ఆలోచనలు అలవర్చుకున్న ఈ బాలుడి ప్రవర్తన పోలీసులను ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

పోలీసులు ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేయగా, అనేక విషయాలు వెల్లడయ్యాయి. సహస్రను హత్య చేసిన తర్వాత ఆధారాలను మాయం చేయడంలో నిందితుడు క్రిమినల్ ఇంటెలిజెన్స్‌తో వ్యవహరించినట్లు బాలానగర్ డీసీపీ వెల్లడించారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

హత్యకు ముందు, క్రికెట్ బ్యాట్, కిట్ కోసం నిందితుడు సహస్ర ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, దొంగతనం బయటపడకూడదని కత్తితో సహస్రపై దాడి చేశాడు. సహస్ర చనిపోయిన తర్వాత, నిందితుడు ఇంటి బయట తలుపు మూసి వెళ్లిపోయాడు.

పోలీసుల విచారణలో, నిందితుడు తరచుగా కత్తితో తిరుగుతాడని, హత్యకు రెండు రోజుల ముందే ఈ ఘాతుకానికి పథకం వేసుకున్నాడని తెలిసింది. నిందితుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా, నిందితుడు నేరాల గురించి రాసుకున్న పుస్తకాన్ని, అలాగే హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం, నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. తన కూతురిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని సహస్ర తండ్రి డిమాండ్ చేశారు. నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, పెద్దల మాదిరిగా నేరం చేసినందుకు కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad