Thursday, April 3, 2025
Homeనేరాలు-ఘోరాలుSriharikota: షార్ లో షాక్..వరుస ఆత్మహత్యలతో శ్రీహరికోటలో టెన్షన్ టెన్షన్

Sriharikota: షార్ లో షాక్..వరుస ఆత్మహత్యలతో శ్రీహరికోటలో టెన్షన్ టెన్షన్

శ్రీహరికోట ..షార్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉరేసుకుని మృతి చెందిన వికాస్ సింగ్ భార్య వార్త దావానలంలా వ్యాపిస్తోంది. సోమవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న CISF SI వికాస్ సింగ్ భార్య షార్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే కానిస్టేబుల్ చింతామణి చెట్టుకు ఉరేసుకోవడం… SI వికాస్ సింగ్..తన గన్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడంతో షార్ లో టెన్షన్ నెలకొంది.

ముగ్గురు పిల్లలున్నా వికాస్ సింగ్ భార్య సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నరాత్రి భర్తను చూడటానికి శ్రీ హరి కోట వచ్చిన భార్య ప్రియాంక సింగ్ అర్ధరాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక సమస్యలు..కొడుకు అనారోగ్యం వీటికి కారణం అయినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరారు. ఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలుండగా..వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News