శ్రీశైలం మహా క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. మూడు సార్లు చక్కర్లు కొడుతూ సుండిపెంట నుంచి శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతంలోని 200 రూములు గణేష్ సదన్, పాతాళ గంగ రోడ్, మల్లమ్మ కన్నీరు, ప్రధాన ఆలయం చుట్టూ మొదట చక్కర్లు కొట్టి తిరిగి సుండిపెంట పరిసర ప్రాంతాలకు వెళ్లి రివర్స్ లో శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా చెక్కర్లు కొట్టింది. అయితే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చార్టర్ ఫ్లైట్ గాని డ్రోన్ కెమెరాలు కానీ చక్కర్లు కొట్టడం నిషేధం. శ్రీశైలం ఆలయం నో ఫ్లయింగ్ జోన్ గా ఉంది అలానే ఎటువంటి అనుమతి లేకుండా తిరగకూడదు అయితే ఈ విషయమై దేవస్థానం అధికారులను వివరణ కోరగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని తెలిపారు అలానే మండల అధికారులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంపై స్థానికులు,భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలోను పలుమార్లు డ్రోన్ తిరిగిన అగంధికులను ఇంతవరకు పట్టుకోవడం జరగలేదు
Srisailam: క్షేత్ర పరిసరాలలో గుర్తుతెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES