Monday, July 8, 2024
Homeనేరాలు-ఘోరాలుSrisailam: భారీగా ప్రభుత్వ మద్యం బాటిళ్ల పట్టివేత

Srisailam: భారీగా ప్రభుత్వ మద్యం బాటిళ్ల పట్టివేత

శ్రీశైలం దేవస్థానం పరిధిలో భారీగా ప్రభుత్వ మద్యం బాటీళ్లను శ్రీశైలం పోలీసులు పట్టుకున్నారు. దేవస్థానం పరిధిలో దేవాదాయ ధర్మాదాయ చట్టం నిబంధనల ప్రకారం మద్యం అమ్మకూడదు, కొనకూడదు. అయితే గత కొన్ని రోజులుగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో మద్యం విక్రయాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. పాతాళగంగ సమీపంలో ఓ ప్రవేటు గృహంలో భారీగా మద్యం ఉన్నట్లు స్దానిక పోలీసులకు సమాచారం వచ్చినట్లు శ్రీశైలం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు సమాచారం అందుకున్న శ్రీశైలం ఎస్ఐ లక్ష్మణరావు సిఐ దివాకర్ రెడ్డి స్దానిక విఆర్ఓతో కలసి వలపన్ని చాకచక్యంగా మద్యం ఉన్న గృహాన్ని తనికీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ఏపి రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ మద్యం బాటీళ్లను నిలువ ఉంచిన మందు బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యం బాటిళ్లు నిబంధనలకు విరుద్దంగా దేవస్థానం పరిధిలో నిల్వ ఉండటాన్ని పోలీసులు పసిగట్టారు. మొత్తం 148 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మద్యం బాటిళ్లతోపాటు ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు శ్రీశైలం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. మద్యం బాటిళ్లతోపాటు నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మణరావు మీడియాకు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News