చెన్నైలోని శ్రీవారి ఆలయంలో(Srivari Temple in Chennai) సిబ్బంది భారీ అవకతవకలకు పాల్పడ్డారు. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో శాశ్వత ఉద్యోగి కృష్ణ కుమార్ చేతివాటం ప్రదర్శించారు.
- Advertisement -
విదేశీ కరెన్సీని స్వాహా చేస్తూ…. మిగిలిన మొత్తాన్ని తిరుపతి ట్రెజరీలో అప్పజెప్తారు వచ్చిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్. హుండీ ఆదాయం విషయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ విచారణకు ఈవో ఆదేశించారు.పూర్తి స్థాయి విచారణ చేపట్టారు విజిలెన్స్ వింగ్.
సీనియర్ అసిస్టెంట్ అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ శాఖ గుర్తించింది. నివేదికను ఈవో శ్యామలరావుకు విజిలెన్స్ వింగ్ సమర్పించింది. నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు.