Tuesday, December 3, 2024
Homeనేరాలు-ఘోరాలుBasara RGUKT | బాసర ఆర్జీయూకేటీ లో విద్యార్థిని సూసైడ్

Basara RGUKT | బాసర ఆర్జీయూకేటీ లో విద్యార్థిని సూసైడ్

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సాయి ప్రియ బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) లో పియుసి సెకండ్ ఇయర్ చదువుతోంది. మరో ఇద్దరు విద్యార్థినులతో కలిసి క్యాంపస్ హాస్టల్లో ఉంటుంది.

సోమవారం తన రూమ్ మేట్స్ ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు మెస్ కి వెళ్ళారు. ఆ సమయంలో సాయి ప్రియ హాస్టల్ గదిలో ఒక్కటే ఉంది. టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఇద్దరమ్మాయిలు తిరిగివచ్చి చూసేసరికి సాయి ప్రియ రూంలో ఫ్యాన్ కి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. అది చూసి షాక్ అయిన ఇద్దరు విద్యార్థినిలు హాస్టల్ సిబ్బందికి తెలియచేశారు. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలిక చేతిలో సూసైడ్ నోట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News