పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య( Suicide) చేసుకున్నాడు ఓ యువకుడు. గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు బండ్ల హనుమంతరావుగా గుర్తించారు.
హనుమంతరావు స్వగ్రామం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడుగా తెలిపారు. భర్త మృతి చెందిన విషయం తెలిసి ఇంట్లో భార్య ఆత్మహత్యయత్నం చేసుకుంది. వెంటేనే ఆమెను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నరసరావుపేట మండలం పమిడిమర్రుకి చెందిన మహిళతో హనమంతరావుకి నాలుగు నెలల కిందట వివాహం అయింది. అంతా సజావుగా సాగుతుండగా పలు కారణాలతో బండ్ల హనుమంతరావు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసినట్లు తెలిసింది. మరి ఏ సమస్య వచ్చిందో ఏమో లాడ్జికి వెళ్లి అక్కడ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. పెళ్ళైన నాలుగు నెలలకే హనుమంతరావు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.