మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్క (35)కు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును తన కార్యాలయంలో అందజేశారు.
- Advertisement -
మావోయిస్టు నేరేళ్ళ జ్యోతి గతనెల 12న పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ప్రభుత్వ అందజేసిన ఆర్ధికసహాయాన్ని శాశ్వత అవసరాల కోసం వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.