Swamy Chaitanyananda Saraswati Arrest: దిల్లీ బాబాగా పేరున్న స్వామి చైతన్యానంద సరస్వతి పై వస్తున్నలైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అతడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
పలు సెక్షన్ల కింద కేసు: విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నందున.. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు అధికారులు ఈ చర్య చేపట్టారు. చైతన్యానంద సరస్వతిపై గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలలో ఉన్న అతని ఆశ్రమాలకు చెందిన విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో అతడు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తుంది.
Also read:https://teluguprabha.net/crime-news/sexual-harassment-allegations-against-swami-chaitanya-in-delhi/
అసలేం జరిగిందంటే: దిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)పై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేశారు. ఆ విద్యార్థులంతా ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినవారు కావడంతో.. ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. వారితో అసభ్యం పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా.. లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు తెలిపారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే.. తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ అంశంపై దిల్లీ పోలీసులు స్పందించి.. 32 మంది విద్యార్థుల్లో 17 మంది నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఈ రోజు పోలీసులు స్వామి చైతన్యానంద సరస్వతిని అరెస్ట్ చేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు: చైతన్యానంద సరస్వతి విద్యార్థినులకు పంపిన అశ్లీల వాట్సాప్ మరియు ఎస్ఎమ్ఎస్ సందేశాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “నా గదికి రా”, “విదేశీ పర్యటనలకు తీసుకెళ్తా”, “ఒప్పుకోకపోతే ఫెయిల్ చేస్తా” వంటి బెదిరింపులు మరియు ఆశ చూపడం వంటి పద్ధతులను అతడు ఉపయోగించినట్లు ఈ చాట్‌ల ద్వారా వెల్లడైంది. మహిళా హాస్టల్లో భద్రత పేరుతో రహస్య కెమెరాలను అమర్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.


