Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: గుళ్లో విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు

Tandur: గుళ్లో విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు

దేవుళ్ళ విగ్రహాలకు రక్షణ లేకుండా పోతోంది. గుళ్ళు కట్టించి, శాస్త్రోక్తంగా ప్రతిష్టించిన దేవాలయాలలో దేవతా మూర్తుల విగ్రహాలు మాయమవుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ప్రతిష్టించిన దత్తాత్రేయుని విగ్రహాన్ని కొందరు దుండగులు అపహరించుకుని పోయారు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు… జినుగుర్తి గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ వీరేశం, గ్రామస్తులు కలిసి రెండేళ్ల క్రితం గ్రామ గేటు సమీపంలో పాలరాతి విగ్రహంలో ఉన్న దత్తాత్రేయుని ప్రతిష్టించారు. దాదాపు రూ. 32 వేలు ఖర్చు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయానికి సమీపంలోనే 32 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన నంది విగ్రహంకూడా ఉంది. అయితే.. గురువారం ఉదయం దత్తాత్రేయుని ప్రతిష్టించిన గుడిలో స్వామి విగ్రహంతో పాటు పురాతనమైన నంది విగ్రహం కూడా అదృశ్యం అయింది. దత్తాత్రేయుని విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన చోట ఓ చెంబును ఉంచి వెళ్లిపోయారు. దత్తాత్రేయుని విగ్రహానికి బదులు చెంబు ఉంచిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దత్తాత్రేయ స్వామి విగ్రహం, అదృశ్యం కావడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శక్తిపీఠం పూజలు.. ఇతర పూజల కోసం విగ్రహాలను ఎత్తుకెళ్లినట్లు గ్రామంలో పుకార్లు పుట్టుకొచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News