Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుTanduru: సంచలనంగా మారిన జిప్సం ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం

Tanduru: సంచలనంగా మారిన జిప్సం ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం

ఆసక్తిగా చర్చించుకుంటున్న స్థానికులు

దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో వెలువడే వ్యర్థ రసాయనాలను తరలించేందుకు పచ్చని పొలాలను నాశనం చేస్తూ, భూగర్భ జలాలను సైతం విషతుల్యంగా మారుస్తూ కల్పవృక్షంలా ఉన్న తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్ సెమ్ జిప్సం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలలోని రసాయన పరిశ్రమలలో వెలువడే అతి ప్రమాదకరమైన వ్యర్థ రసాయనాలు!పచ్చని పంటలతో, స్వచ్ఛమైన భూగర్భ జలాలతో కళకళలాడే ఆ గ్రామానికి జిప్సం తయారీ పరిశ్రమగా రూపాంతరం చెంది రైతన్నలకు ఆ జిప్సం పరిశ్రమ గుదిబండగా మారింది. జిప్సం ఫ్యాక్టరీలోని వ్యర్థ రసాయనాలు భూమిలో కలిసిపోవడంతో భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయని ఆ నీటిని పంటలకు సాగు చేయడంతో గుంత బాస్పల్లి గ్రామంలోని పంటలు కూడా విషతుల్యం అవుతూ పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని ఎన్నో సందర్భాలలో ఫ్యాక్టరీ మూసి వేయించాలని ఆందోళనలు రాస్తారోకోలు చేసి నాయకులకు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా కూడ రాజకీయ నాయకుల అండదండలతో ఆ జిప్సం ఫ్యాక్టరీని మూసి వేసేందుకు ఇన్నాళ్లు ఎవరూ కూడ సాహసం చేయలేకపోయారు.

- Advertisement -

కానీ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు, రాస్తారోకోలు, అధికారులకు వేడుకొని సమర్పించిన వినతి పత్రాలను చూస్తూ చూస్తూ విసిగి వేసారారు. షార్ట్ సర్క్యూట్ జిప్సం ఫ్యాక్టరీని భూస్థాపితం చేసిందంటూ పలువురు రైతులు గ్రామంలో చర్చించుంటున్నారు.
ఇదిలా ఉండగా కేవలం ఏడాది కాలంలోనే జిప్సం ఫ్యాక్టరీలో రెండుసార్లు అగ్గి ప్రమాదం జరగడంపై మతలబ్ ఏంటి? ఇది ప్రమాదమేనా? లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా? అంటూ పలువురు గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News