టీడీపీ నేత దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. ఈ ఘటనతో కర్నూలు నగరం అట్టుడుకుతోంది.
- Advertisement -
ఎన్నికల ముందు అంజన్న వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు సంజన్న. ఈయన మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు తరలింపు.
శరీన్ నగర్ కార్పొరేటర్ జయరాం తండ్రి కాశపోగు సంజన్న భజన మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కిరాయి హంతకుడు వడ్డే అంజిగా గుర్తించారు పోలీసులు. వడ్డే అంజికి, కాశపోగు సంజన్నకు గతంలో మనస్ఫర్థాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు.