Teacher Caught Cheating With Colleague By Husband: ఒడిశాలోని పూరీ జిల్లాలో ఒక అమానుష ఘటన జరిగింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలిని, ఆమె సహోద్యోగిని వివాహేతర సంబంధం నెపంపై ఆమె భర్త, అతని స్నేహితులు దారుణంగా దాడి చేసి, అవమానాలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ: Kukatpally Murder Case: పనివాళ్ల దారుణం.. మహిళ గొంతు కోసి, కుక్కర్‌తో కొట్టి హత్య..!
పోలీసుల కథనం ప్రకారం, తన భర్తతో విభేదాల కారణంగా విడిగా నివసిస్తున్న ఆ మహిళ, మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లో ఉండగా ఆమె భర్త, కొంతమంది స్నేహితులతో కలిసి వచ్చారు. అక్కడ తన భార్యతో ఆమె సహోద్యోగిని చూసిన అతడు ఆగ్రహానికి గురయ్యాడు.
ALSO READ: Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. యువకుడి ప్రాణం తీసిన పరోటా.. అసలు ఏం జరిగిందంటే..?
చెప్పుల దండ, అర్ధ నగ్నంగా ఉరేగింపు..
భార్యను ఇంటి నుండి బయటకు లాగి, కొట్టి, చెప్పుల దండతో ఊరేగించారు. ఆమె సహోద్యోగిని కూడా అర్ధనగ్నంగా మార్చి, అదే విధంగా అవమానాలకు గురిచేశారు. వీడియోలలో కనిపించిన దృశ్యాలు దారుణంగా ఉన్నాయి.
ALSO READ: Woman Set On Fire: మంటల్లో కాలుతూనే స్కూటర్ నడిపి ఆసుపత్రికి మహిళ.. చికిత్స పొందుతూ..
చుట్టూ ఉన్న జనం చూస్తూ, తమ ఫోన్లలో ఈ అమానవీయ ఘటనను రికార్డు చేశారు. మహిళ మెడలో చెప్పుల దండతో, ఆ వ్యక్తిని అర్ధ నగ్నంగా పోలీస్ స్టేషన్ వైపు నడిపించారు మహిళ భర్త, అతడి స్నేహితులు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని, తక్షణమే స్పందించారు. మహిళను అవమానించినందుకు, అక్రమంగా దాడి చేసినందుకు ఆమె భర్తతో పాటు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Double Homicide: అడవిలో ఇద్దరు మహిళల మృతదేహాలు.. ప్రియుడు ఏం చేశాడంటే?


