నంద్యాల జిల్లా కేంద్రంలో పనిచేసే ఓ సిఐ చేస్తున్న అవినీతి అక్రమాలు, ఆ సీఐ పేరు చెప్పి ఓ హోంగార్డు, ఓ సీనియర్ కానిస్టేబుల్ చేస్తున్న అక్రమాలపై ఆదివారం తెలుగుప్రభ దినపత్రికలో కేసుకొక రేటు అనే శీర్షికతో ప్రత్యేక కథనం అందించిన విషయం పాఠకులకు తెలిసింది. ఈ వార్తపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి వెంటనే స్పందించారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్ బి (స్పెషల్ బ్రాంచ్) పోలీస్ ల ద్వారా ఆ వార్తలకు సంబంధించిన పలు పత్రాలను సోమవారం తీసుకురావాలని చెప్పడంతో పాటు ఆ సిఐ స్టేషన్ పరిధిలో ఇంత జరుగుతున్న నా దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని ఎస్ బి కానిస్టేబుల్స్ పై సీరియస్ అయినట్టు సమాచారం.
ఎస్ బి పోలీసులతో పాటు, స్పెషల్ ఇంటెలిజెన్సీ, క్రైమ్ పార్టీ పోలీసులను కూడా రంగంలో దింపినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఎస్పీ ఇలాంటి అవినీతి అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.