కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కే తిమ్మాపురం లో మారెమ్మ దేవాలయంలో హుండీ చోరికి గురైంది. శుక్రవారం రాత్రి మారెమ్మ గుడి లో సీసీ కెమెరా వైర్లు తొలగించి గర్భగుడిలో ఉన్న హుండీ ని బయటకు తెచ్చి పగులగొట్టారు దొంగలు. ఈ చోరి ఇంటి దొంగల పనై ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
3 నెలల నుండి హుండీ నుండి డబ్బులు బయటకు తీయలేదని దాదాపు 3 లక్షలు వరకు ఉన్నట్లు గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. చోరి జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కే తిమ్మాపురం గ్రామానికి చెందిన పలువురు అనుమానితుల పేర్లు పోలీసులకు చెప్పారు. వారిని విచారిస్తే హుండీ చోరి గుట్టు బయటకు వస్తుందని చెబుతున్నారు. మారెమ్మ గుడిలో మరోసారి హుండీ దొంగతనం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మిగనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Temple chori: సీసీ కెమరా వైర్స్ కట్.. గుళ్లో 3 లక్షల చోరీ..
ఇంటి దొంగల పనై ఉండవచ్చునని గ్రామస్తుల అనుమానం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES