Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుThangallapalli: పిడుగు పడి రైతు మృతి

Thangallapalli: పిడుగు పడి రైతు మృతి

అక్కడికక్కడే మృతి

పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని, భరత్ నగర్ లో చోటుచేసుకుంది. రుద్రరపు చంద్రయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రుద్రారపు చంద్రయ్య అనే రైతు పొలం వద్ద పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో, కూడిన వర్షం పడడంతో అక్కడే పొలంలో పనులు చేస్తున్న చంద్రయ్యపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. వెంటనే స్థానికులు మృతదేహాన్ని అతని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. మృతుడికి భార్య కళావతి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News