Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుThangallapalli: అపరిచితులను గుర్తించేందుకే కార్డెన్ సెర్చ్

Thangallapalli: అపరిచితులను గుర్తించేందుకే కార్డెన్ సెర్చ్

అన్నివిధాలా పోలీసులకు సహకరించండి

అపరిచిత వ్యక్తులను గుర్తించేందుకే కార్డెన్ సెర్చ్ అని డి.ఎస్.పి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఐపీఎస్ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రశేకర్ రెడ్డి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ అనేది ప్రజల భద్రత గురించేనని వెల్లడించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, కొత్త వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి ఆధార్ కార్డులతో సహా, ధ్రువపత్రాలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

యువత మాదక ద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఇచ్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరియైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను, 03 ఆటోలను, 01 కారును సీజ్ చేసి చేశారు. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని తెలిపారు.

ఈనెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై సుధాకర్, ఏఎస్ఐ చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుల్స్ సాంబశివరావు, మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News