Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుThangallapalli: మహాలక్ష్మి రైస్ మిల్ మూసేయాలి

Thangallapalli: మహాలక్ష్మి రైస్ మిల్ మూసేయాలి

దుమ్ము ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్న వడ్డెర కులస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూరు చౌరస్తా సమీపంలో గల మహాలక్ష్మి (ట్రేడర్స్) రైస్ మిల్లు మూసివేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు గజభింకార్ సంతోష్ ఆధ్వర్యంలో వడ్డెర కులస్థులు ఎమ్మార్వో వెంకటలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్లు వలన వచ్చే దుమ్ము ధూళితో రైస్ మిల్లు వెనకాల గల వడ్డెర కాలనీలో నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతూ.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. కాయకష్టం చేసుకొని బ్రతికే వడ్డెరలకు రైస్ మిల్లు ద్వారా వచ్చే దుమ్ము, ధూళి, పురుగుల ద్వారా ఆరోగ్యాలు చెడిపోయి, జేబులకు చిల్లుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహాలక్ష్మి రైస్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడటానికి వెళ్తే వారిని కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదని, మిల్లుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. ఆ మిల్లుపై చర్యలు తీసుకోని యెడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షుడు ద్యారంగుల రాజు, బాలకృష్ణ, బాలరాజు, అంజి, రాజు, మోహన్, గోపాల్, లక్ష్మీనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News