Thursday, March 6, 2025
Homeనేరాలు-ఘోరాలుMurder: ప్రేమ వివాహం చేసుకుందని ఇద్దరిని కత్తితో పొడిచిన యువతి తండ్రి..

Murder: ప్రేమ వివాహం చేసుకుందని ఇద్దరిని కత్తితో పొడిచిన యువతి తండ్రి..

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుందని యువతీ, యువకుడిపై కత్తితో దాడి చేశాడు యువతి తండ్రి.

- Advertisement -

అడ్డువచ్చిన ఇద్దరి కడుపులో కత్తితో పొడిచాడు శీనప్ప. పెద్దల సమక్షంలో మాట్లాడతాము అని పిలిచి నలుగురిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొంకరి కడుపులో కత్తి ఇరుక్కుపోయింది.

కత్తి పోట్లతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

భాధితులు గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతా రామప్పగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News