Wednesday, February 5, 2025
HomeTS జిల్లా వార్తలునాగారకర్నూల్Attack: స్టూడెంట్స్ పై చెప్పు విసిరిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి..!!

Attack: స్టూడెంట్స్ పై చెప్పు విసిరిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి..!!

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. వారికి మంచి చదువుతో పాటు సంస్కారం నేర్పించాల్సిన గురువే ఇలా దాడి చేస్తే ఎలా..? ఇలాంటి ముచ్చటే తెలంగాణ రాష్ట్రం నాగార్ కర్నూల్లో చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం పదండి.

- Advertisement -

అచ్చంపేట కొండ నాగుల పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 9 వ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు సరదాగా శుక్రవారం మైదానంలో ఆడుకుంటున్నారు. ఏవో వారిలో వారు మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. అంతలోనే అటుగా వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి తనను చూసే నవ్వారని భావించి కోపంగా తన కాలికి ఉన్న చెప్పును కసిగా విసిరేశాడు ఆ స్డూడెెంట్స్ పైకి.

అంతే ఇంకేముంది దీంతో ఆ చెప్పు విసురుగా వచ్చి ఆ విద్యార్థినీల మెడకు, చెవులకు తగిలి గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా శనివారం వారు పాఠశాలకే వచ్చారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన మీరే ఇలా చెప్పుతో దాడి ఎలా చేశారని శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ది చేశారు.

మరి నవ్వితే మాత్రం ఇలా చెప్పు విసరటం సరైన పద్దతి కాదని స్థానికులు మండిపడుతున్నారు. అమ్మాయిలు పాపం అవమానంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి అవమానంగా ఫీలయ్యారు. మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News