కడప జిల్లాలో పట్టపగలే దొంగలు(Chori) రెచ్చిపోయారు. కమలాపురం నగరంలోని గిడ్డింగ్ వీధిలో నివాసం ఉంటున్న కరంగూడి లక్ష్మీదేవిపై కత్తితో గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బంగారు సరుడును దొంగలించారు.
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో దూరి కంట్లో కారం పొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు సరుడు తీసుకెళ్లాడు ఓ దుండగుడు. మహిళ ముక్కు, మెడ, పలుచోట్ల కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బంగారం కావాలి ఇస్తే ఏమీ చేయను అని ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు తెలిపారు. బాధితురాలి భర్త కరంగూడి శేఖర్ రెడ్డి కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.