Sunday, June 30, 2024
Homeనేరాలు-ఘోరాలుThorruru: ఎక్సైజ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం

Thorruru: ఎక్సైజ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం

9 ఏళ్ళ క్రితం కేసుకు 50,000 డిమాండ్


ఎక్సైజ్ శాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి శివారు కపూర్య తండా పరిధిలో చోటుచేసుకుంది. ఈ తండాకు చెందిన భీముడు అనే వ్యక్తిపై 9 ఏళ్ల క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసును వెలికి తీసి ఎక్సైజ్ శాఖ అధికారులు డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

ఈ వేధింపులు తట్టుకోలేక భీముడు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని కపూర్యా తండావాసులు ఆగ్రహంతో తొర్రూర్ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News