వైకుంఠ ద్వార దర్శనం కోసం గురువారం ఉదయం 5 గంటలకు జారీ చేసే టోకన్ల కోసం భక్తులు ఎగబడటంతో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తొక్కిస్తున్నట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పలువురికి గాయాలు కావడంతో పాటు నలుగురు భక్తులు మృతి చెందారు. క్షతగాత్రులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్లో జరిగిన తొక్కేసిలాటలో కొందురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సందర్శించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన పరామర్శించారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల టోకన్లు పొందే క్రమంలో భక్తులు ఎగబడటంతో ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.
మృతి చెందిన భక్తుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు.