Tribal Welfare ENC Srinivas : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ (Tribal Welfare) లో సంచలనం సృష్టించిన ఘటనలో ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) అబ్బవరపు శ్రీనివాస్ (Abbavarapu Srinivas)ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
కేసు వివరాలు
ఈ కేసు రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల చుట్టూ తిరుగుతోంది. ఈఎన్‌సీ శ్రీనివాస్, కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి బిల్లులను మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. మొత్తం రూ. 50 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా కృష్ణంరాజు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.
ALSO READ : AP Rains: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్ర ఒత్తిడి చేయడంతో, వేధింపులు సహించలేక కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల విసిరారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తుండగా, అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక శ్రీనివాస్ మరో మూడు వారాల్లో రిటైర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత లంచం తీసుకుంటూ పట్టుబడటం అతని కెరీర్ లోనే మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.
ALSO READ : The Paradise First Look: ‘జడల్’గా నేచురల్ స్టార్.. ‘ది ప్యారడైజ్’.. ఇప్పటి వరకు చూడని సరికొత్త ఫస్ట్ లుక్
ఉన్నత స్థాయి అవినీతి
రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక శాఖలో ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి లంచం కేసులో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ప్రభుత్వ ప్రాజెక్టులలో అవినీతి సమస్యను బయటపెడుతూ, ప్రజా కార్యాలయాల్లో జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


