ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, కడప జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పదవ తరగతి చదివే స్టూడెంట్స్ ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డారు. తమ పిల్లలు ఆత్మహత్యకు పాల్పడటంపై తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం
అక్కయ్యపాలెం, ఎన్జీజీఓఎస్ కాలనీలో విష్ణు విల్లా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న టెన్త్ క్లాస్ విద్యార్థిని కే. సాస అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. సీతమ్మధారలోని ప్రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న ఈ బాలికకు ఏమి జరిగిందనేది స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించినా, మార్గమధ్యంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
కడప నగరంలో
కడప నగరంలో విషాదం చోటుచేసుకుంది. మునిసిపల్ మెయిన్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న చలమారెడ్డి పల్లెకు చెందిన పి.చరిత ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ కు వెళ్ళడం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ అమ్మాయి ఆత్మహత్య పై విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.ఎం. ఓబులేసు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Suicide: ఏపీలో ఒకే రోజు ఇద్దరు టెన్త్ స్టూడెంట్స్ ఆత్మహత్య
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES