ప్రేమ వివాహం, ఏడాదికే చిత్రహింసలు
ఈ ఘటన మౌ రాణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత మహిళ తీజా (26) తెలిపిన వివరాల ప్రకారం… ఆమె 2022లో ముఖేష్ అహిర్వార్ అనే వ్యక్తిని ఆలయంలో కలుసుకున్నారు. జీవితాంతం తోడుంటానని, బాగా చూసుకుంటానని అతడు హామీ ఇవ్వడంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన మొదటి సంవత్సరం అంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత అహిర్వార్ తరచూ ఇంటికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు.
తాజాగా, సోమవారం ఇంటికి వచ్చిన అహిర్వార్ ఆమెను కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం కూడా ఆమెను కొట్టి బలవంతంగా కలవడానికి ప్రయత్నించగా, తీజా ప్రతిఘటించింది. దీంతో కోపం పట్టలేని అహిర్వార్, తన తల్లిదండ్రులతో కలిసి ఆమెను రెండంతస్తుల ఇంటి పైకప్పు నుంచి కిందకు తోసేశాడని బాధితురాలు ఆరోపించింది.
ఆసుపత్రిలో చికిత్స
తీజా అరుపులు వినిపించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గమనించి, తక్షణమే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.
పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ… బాధితురాలు తీజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, విచారణ అనంతరం నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ALSO READ: Blackmail With AI Images: ఏఐ దారుణం.. సోదరీమణుల అశ్లీల ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. విద్యార్థి ఆత్మహత్య


