తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం నీటిని నిలువ ఉంచాలనే సంకల్పంతో, విలాసాగర్ గ్రామంలో మానేరు వాగుపై 2016లో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చొరవతో పది కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యాం నిర్మించారు, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మానేరు డ్యాం పూర్తిగా నీటితో నిండడంతో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలిపెట్టారు దీనితోపాటు కలవల ప్రాజెక్టు గండి పడటంతో వరద నీటి ఉధృతి మరింత పెరిగి, మల్లారెడ్డి పల్లె గ్రామంలోని చెరువు మత్తడి తెగిపోవడంతో వరదనీరు ఉధృతి మరింత వేగవంతమై మానేరు వాగులో ప్రవాహం ఎక్కువ అవ్వడంతో ఆ తాకిడికి తట్టుకోలేక ఆదివారం రాత్రి చెక్ డ్యాం పూర్తిగా కొట్టుకుపోయి మానేరు వాగు పరివాహక ప్రాంతాలలోని వందలాది ఎకరాలలో పంటలు పూర్తిగా కొట్టుకపోయి ఇసుక మేటలు పెట్టాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీటి ప్రవాహంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే ఈ ముప్పు వాటిల్లేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రవాహంతో కొట్టుకుపోయిన పంటలకు ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరద నీటితో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ ను కేడీసీసీ బ్యాంక్ జిల్లావైస్ చైర్మన్ పింగిలి రమేష్ పరిశీలించారు, ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.