Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుWarangal: 50 కిలోల గంజాయి సీజ్

Warangal: 50 కిలోల గంజాయి సీజ్

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

రెండు వేర్వేరు సంఘటనల్లో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడతున్న రెండు ముఠాల్లో ముగ్గురు సభ్యులను ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ పోలీసులు శుక్రవారంఅరెస్టు చేసారు. వీరి నుండి సూమారు పది లక్షల విలువ గల 50కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఒడిషా రాష్ట్రానికి చెందిన జన్కర్ మెహెర్ (24), మోహన్ చలన్ (33), జ్యోతి ప్రకాశ్ దలాయి (34), లను పోలీసులు అరెస్టు చేసారు.

- Advertisement -


అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారి వివరాలను వెల్లడిస్తూ… పోలీసులకు పట్టుబడిన రెండు ముఠాలకు చెందిన సభ్యులు సులభంగా డబ్బు సంపాదన కోసం నిందితులు తమ పరిచయం వున్న ద్వారా గంజాయిని రైలు ద్వారా అక్రమ రవాణా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ రెండు ముఠా సభ్యులు ఆంధ్ర, ఒడిషా సరిహద్దులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసేవారు. కొనుగోలు చేసిన గంజాయిని ఎక్కువ ధరకు, హైదరాబాద్, మధ్య ప్రదేశ్ మహరాష్ట్రల్లో అమ్మేందుకు సిద్దపడిన నిందితులు రెండు వేర్వేరు రైళ్ళల్లో ఇతర రాష్ట్రాలకు బయలుదేరారని, వీరికి వీరు ప్రయాణించే మార్గాల్లో పోలీసులు తనీఖీలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో నిందితుల్లో వారి వద్ద వున్న గంజాయిని వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో విక్రయించాలనుకోవడంతో పాటు మరో స్మగ్లర్ జ్యోతి, ప్రకాశ్ పోలీసులకు అనుమానం రాకుండా వుండేందుకుగాను భువనేశ్వర్ నుండి వచ్చిన రైలులో కాకుండా, మరో రైలులో హైదరాబాద్ కు వెళ్లేందకు వరంగల్ లో దిగి రైల్వే స్టేషన్ ముందువుండగా, మిగితా ఇద్దరు నిందితులు శివనగర్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుచుండగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు తనీఖీలు నిర్వహిస్తున్న ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా నిందితులను అనుమానంతో పోలీసులు తనీఖీ చేయగా ఇంతేజార్ గంజ్ పోలీసులు జ్యోతి ప్రకాశ్ వద్ద 17 కిలోలు గంజాయిని, మిల్స్ కాలనీ పోలీసులు మరో ఇద్దరు నిందితులు మెహెర్, మోహన్ చలన్ వద్ద 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొ ని వారిని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసిపి బోనాల కిషన్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సురేష్, ఎస్.ఐలు సాయి ప్రసన్న కుమార్, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్, రవీందర్ రెడ్డి, శివకృష్ణ, ఉపేందర్ తో పాటు స్థానిక రైల్వే ప్రొటెక్షన్ పోలీసులను డిసిపి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News