పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(Pastor Praveen Pagadala) మృతికి సంబంధించి తప్పుడు వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని SP అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు.
కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
సోమవారం వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది.మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన విధానం బట్టి ప్రమాదం జరగవచ్చు అని చర్చ నడుస్తుంది. అయితే మద్యం కొన్నది ప్రవీణ్ కాదా అనేది ఈ వీడియోలో అంత క్లారిటీగా లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pastor Praveen: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం: SP
సంబంధిత వార్తలు | RELATED ARTICLES