తిరుపతిలో సుండుపల్లికి చెందిన మహిళ మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య(Suicide) చేసుకుంది.తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడి నగర్, పద్మావతి అపార్ట్మెంట్ ఫై నుంచి క్రిందకు దూకటంతో మృతి చెందింది.
మృతురాలు సుండుపల్లి మండలానికి చెందిన పి.గౌతమి (34) గా గుర్తించారు. రాజంపేటకు చెందిన గౌతమిని సుండుపల్లికి చెందిన వెంకటేష్ తో వివాహం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి ఆత్మహత్య చేసుకుంది.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగాలేదని అందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.తండ్రి సుబ్బరాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్సై గిరిబాబు తెలిపారు.