Woman Harassed by 7-Year-Old Boy: ఈ రోజుల్లో చిన్నపిల్లలు చేసే తప్పులను కూడా సరదాగా తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఒక మహిళకు ఎదురైన అనుభవం, ఇది ఎంత తీవ్రమైన సమస్యో చాటిచెబుతోంది. ఢిల్లీలోని ఒక మహిళ, తన నివాస సముదాయంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఏడేళ్ల చిన్నవాడు ఆమెను మాటలతో వేధించాడు.
View this post on Instagram
ALSO READ: Dowry death: ఎముకల గూడులా మారిన శరీరం.. కట్నం కోసం కసాయిలుగా మారిన అత్తవారిల్లు
ఎరుపు రంగు టాప్, పొడవాటి స్కర్ట్ ధరించిన ఆ మహిళను చూసి, ఆ కుర్రాడు “ఓ లాల్ పరీ” అని పిలిచాడు. ఆ తర్వాత “ఎవరు నువ్వు? నాతో వస్తావా?” అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనతో ఆ మహిళ షాక్ అయ్యారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు నవ్వుతూ ఉండటంతో ఆమె మరింత కంగారుపడింది. ఆ బాలుడిని ఆమె అడగబోతే, అతను ఏదో అలా “సారీ” చెప్పి పారిపోయాడు.
ఈ సంఘటనపై ఆ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. “ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దకపోతే, ఈ సరదా రేపు వేధింపులుగా మారుతుంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలు పిల్లలు కొత్తగా కనిపెట్టరు, బయట చూసి, విని నేర్చుకుంటారు. దాన్ని సరిదిద్దకపోతే, పెద్దయ్యాక అది వేధింపుగా మారుతుంది అని ఆమె చెప్పారు.
ALSO READ: Honour Killing: ఏడాది క్రితం ప్రేమ వివాహం.. యువకుడిని దారుణంగా కొట్టి చంపిన అత్తింటివారు
ఈ సంఘటన గురించి సెక్యూరిటీ గార్డు ఆ బాలుడిని వెనకేసుకొచ్చారు. “మంచి కుటుంబం నుంచి వచ్చాడు, సరదాకి అన్నాడు” అంటూ తేలికగా తీసుకున్నారు. ఇది ఆ మహిళకు మరింత ఆగ్రహం తెప్పించింది. చాలా మంది నెటిజన్లు కూడా ఈ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఆమె ఈ విషయం గురించి ఆ బాలుడి తల్లిదండ్రులకు చెప్పి, సరిదిద్దమని సూచించారు. పిల్లల పెంపకం, మహిళల భద్రతపై ఇది ఒక చర్చనీయాంశంగా మారింది.


