Sunday, May 18, 2025
Homeనేరాలు-ఘోరాలుHonour Killing : నర్సింగ్ చదువుతున్న కూతురిని కడతేర్చిన తల్లి..

Honour Killing : నర్సింగ్ చదువుతున్న కూతురిని కడతేర్చిన తల్లి..

దేశంలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే యూపీకి చెందిన ఆయుషి కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఆమె తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా తమిళనాడులో మరో పరువుహత్య ఘటన వెలుగుచూసింది. కూతురు వెేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని తెలియడంతో.. కన్నతల్లే హతమార్చింది. ఆపై ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరునల్వేలికి చెందిన అరుముగ కని, పిచయ్ దంపతులకు అరుణ(19) అనే కూతురు ఉంది.

- Advertisement -

అరుణ ప్రస్తుతం వేరే ఊరిలో ఉంటూ నర్సింగ్ కోర్స్ చదువుతోంది. ఈక్రమంలో అరుణ ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని నేరుగా తన తల్లికి చెప్పింది అరుణ. ప్రేమ వ్యవహారంపై మాట్లాడేందుకు అరుణను ఇంటికి పిలిపించింది. ప్రేమ లాంటిది ఏమీ పెట్టుకోకుండా తనుచూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. కానీ అరుణ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో.. తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం తలెత్తి.. గొడవ పెద్దదైంది. ఆగ్రహానికి గురైన తల్లి.. కూతుర్ని గొంతు కోసి హతమార్చింది. అనంతరం తానూ హెయిర్ డై (తలకు వేసుకునే రంగు) తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చి.. పోలీసులకు సమాచారమిచ్చారు. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. ప్రస్తుతం అరుముగ చికిత్స పొందుతుండగా.. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News