Sunday, March 16, 2025
Homeనేరాలు-ఘోరాలుYS Sunitha: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన వైఎస్‌ సునీత

YS Sunitha: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన వైఎస్‌ సునీత

గవర్నర్ ను వైఎస్ సునీత( YS Sunitha Reddy) కలిశారు. వివేకానంద రెడ్డి(Viveka Murder case) హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని విచారణ నిష్పక్షపాతంగా జరపాలని గవర్నర్ ను కోరారు. ఆరేళ్లుగా సీబీఐ, సిట్ విచారణ వల్ల న్యాయం జరగలేదని ఫిర్యాదు చేశారు.

- Advertisement -

వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని ఇప్పటికే మీడియా సమావేశంలో చెప్పారు. ఈ కేసులో నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్లో లోపాలు జరిగాయని ఆరోపించారు వైఎస్ సునీత.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతుండటంతో ప్రభుత్వం ఈ కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే నేటితో వివేకా హత్యకు గురై ఆరు సంవత్సరాలు పూర్తి అయింది. వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha Reddy) పులివెందులలో నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాని వాపోయారు. ఇంత అన్యాయం జరిగినా ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదన్నారు. అయినా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సీబీఐ మళ్లీ విచారణ మొదలు పెడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందన్నారు. అయితే సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు సిస్టమ్‌ మేనేజ్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇక సాక్షుల మరణాలు వెనక కుట్రలు ఉన్నాయని ఆమె ఆరోపించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News