Saturday, October 5, 2024
HomeదైవంCheryala: ఆండాళ్ అమ్మ పుట్టినరోజు ప్రత్యేక పూజలు

Cheryala: ఆండాళ్ అమ్మ పుట్టినరోజు ప్రత్యేక పూజలు

మానవతను,ప్రేమ తత్వాన్ని చాటిన ఆండాళ్ దేవి

కలియుగంలో మానవాళి ఎలా జీవించాలో ప్రేమను, మానవతను ఎలా పంచాలో 1000 ఏండ్ల క్రితమే గోదా తల్లి ఆచరించి చూపిందని, నిస్వార్థమైన ప్రేమతో సాక్షాత్ ఆ దేవుడినే తన పెనిమిటిగా సాధించుకున్న ఆండాళ్ గోదా దేవి కలియుగానికి ఆదర్శమూర్తి అని వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషా చార్యులు అన్నారు. కోవెలలో ఆండాళ్ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రభాత వేళ మంగళ స్నానం అభిషేకం అర్చన ద్రవిడ ప్రబంద సేవాకాలము తనీయ విన్నపం ముప్పై పాశురాల విన్నపం తదితర పూజలతో అశేష భగవత్ బంధువుల భక్తి తో నిర్వహించారు. ఈ అమ్మే ధనుర్మాసం పూజలకు కారణం అని తెలిపారు. ఈ తిరునక్షత్రోత్సవం కార్యక్రమంలో అల్లాడి ఆండాలు, జగదీశ్వర్, హరిప్రసాద్ చారీ, సంధ్య, హారిన, శ్రవణ్ కుమార్, లక్ష్మి, సులోచన, ఐలమ్మ, సరిత, గాయత్రి, సరస్వతి, అన్నపూర్ణ, సిద్దమ్మ, రామలక్ష్మి తదితరులు పాల్గొని లోకకళ్యాణం కోసం పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News