Saturday, April 5, 2025
HomeదైవంAdoni: రతి మన్మధులకు ప్రత్యేక పూజలు

Adoni: రతి మన్మధులకు ప్రత్యేక పూజలు

పురుషుడు మగువగా ..

హోలీ అంటేనే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సందడి కనిపిస్తుంది. చేసిన తప్పును ఒకరినొకరు రంగులు పూసుకుంటూ మన జీవితం కూడా రంగులమయంగా సంతోషంగా వర్ధిల్లాలని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అయితే ఎక్కడాలేని విధంగా ఆదోని మండలం సంతే కడులూర్ గ్రామంలో హోలీ పండుగను వింత అచారంతో జరుపుకోవడం విశేషం.

- Advertisement -

ఇక్కడ మూడు రోజులపాటు హోలీ సంబరాలు జరుపుకుంటారు. అందరిలా ఇక్కడ రంగులు వేసుకోరు…తాత ముత్తాతల కాలం నుండి విచిత్ర ఆచారం కొనసాగుతోంది. కంప్యూటర్ యుగంలో సాంప్రదాయం, ఆచారాలను పాటించడం ఆనవాయితీకి వేదిక అయింది.

రతి మన్మధ దేవాలయముకు వెళ్లి కోరికలను కోరుకుంటారు. నెరవేరిన కోరికలను తీర్చుకునేందుకు ఇంటిలో ఉన్న మగ పురుషులలో ఒకరు స్త్రీ వేషాధారణ ధరించి కుటుంబసమేతంగా రతి మన్మధ దేవాలయముకు వెళ్లి మ్రొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ వింత అచరాన్ని చూడడానికి చుట్టూ ప్రక్క ప్రజలు తరలిరావడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News