సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎగువ శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ద్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఎగువ హోబిలంలో ధ్వజారోహణ బంగారు ధ్వజస్తంభం పైకి గరుడ పటం అధిరోహించింది. అహోబిలం 46 వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శఠగోప యతేంద్ర మహదేశికన్. ఆశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో ప్రారంభమైనాయి వేద పండితులు వేద మంత్రోచ్ఛారణ సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ద్వజోరోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు శనివారం నుండి 17వ తేదీన దిగువన ధ్వజారోహణ ఎగువన 22 కల్యాణోత్సవం 23న దిగువన కళ్యాణోత్సవము 24 ఎగువన రథోత్సవము 25న దిగువన రథోత్సవము ఎగువన 25 గరుడోత్సవము దిగువ అహోబిలంలో 26న గరుడోత్సవం నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఓయస్డి శివప్రసాద్, మఠం మేనేజర్ భద్రయ్య ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.