Sunday, July 7, 2024
HomeదైవంAhobilam: అహోబిలం కొండకు చేరిన ఉత్సవమూర్తుల పల్లకి

Ahobilam: అహోబిలం కొండకు చేరిన ఉత్సవమూర్తుల పల్లకి

ఘనంగా ముగిసిన పారువేట ఉత్సవాలు

గోవింద నామస్మరణతో నారసింహుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలకగా ఉత్సవమూర్తులు కొలువుదీరిన పారువేట పల్లకి అహోబిలం కొండకు చేరింది. అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ( కళ్యాణం ) బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవమూర్తుల పారువేట పల్లకి జనవరి 16వ తేదీ సంక్రాంతి పర్వదినాన పారువేట పల్లకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం నుండి గ్రామాలలో పారువేట సందర్శన చేసింది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ రుద్రవరం మండలాలలో కలుపుకొని 45 రోజులు 32 గ్రామాలలో ఉత్సవమూర్తులు కొలువుదీరిన పారువేట పల్లకి భక్తులకు దర్శనమిస్తూ అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటూ పారువేట కొనసాగింది. పారువేట చివరి మజిలీలో మండల కేంద్రమైన రుద్రవరం గ్రామంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు ఉత్సవ మూర్తులకు ఘనంగా పూజలు నిర్వహించడంతో పారువేట ముగిసింది.

- Advertisement -

పారువేట ముగింపు సందర్భంగా అటవీ శాఖ కార్యాలయం తెలుపుపై చేరుకున్న ఉత్సవమూర్తులకు రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్కభజన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు స్వామి వెంట గ్రామాలు తిరుగుతూ వస్తున్న యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పారువేట ఉత్సవాలు బుధవారంతో ముగియడంతో ఉత్సవమూర్తులు కొలువుదీరిన పారువేట పల్లకిని బోయిలు కాలినడకన మోసుకెళ్లారు. మార్గమధ్యంలోని అహోబిలం ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకుడు చంద్ర కేశవ్ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ మూర్తులు కొరువుదీరిన పారువేట పల్లకి గురువారం ఉదయం అహోబిలం కొండకు చేరింది. పారువేట పల్లకి కొండకు చేరిన వారం రోజుల తర్వాత అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News