అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ వన్ శఠగోప యతింద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి మణిమయ ఖచిత ఆభరణాలతో కూడిన స్వర్ణ శేష వాహనముపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ ఉభయదారులుగా ఆళ్లగడ్డ రెవెన్యూ శాఖ తరపున నంద్యాల జిల్లా సబ్ కలెక్టర్ శ్రీనివాసులు, ఆళ్లగడ్డ తాసిల్దార్ హరినాధరావు , డిప్యూటీ తాసిల్దారులు రవీంద్ర ప్రసాద్, చంద్రశేఖర్, ఆర్ ఐ ప్రసాద్, వీఆర్వోలు పరమేశ్వర రెడ్డి, సంజీవ రాయుడు, కిషోర్, తులసి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దిగువ అహోబిళంలో రాత్రికి శరభ వాహనంపై జ్వాలా నరసింహుడు ఆశీనుడు కాగా, జయ జయ ధ్వనులతో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదుడు నాలుగు మాడల వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి సంపత్ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలం భద్రయ్య రంగరాజులు తదితరులు పాల్గొన్నారు.