Sunday, November 16, 2025
HomeదైవంGanesh Nimajjanam: గణపయ్య నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేస్తే.. మీరు కష్టాలు కొని...

Ganesh Nimajjanam: గణపయ్య నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేస్తే.. మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

- Advertisement -

Avoiding these Mistakes on Ganesh Nimajjanam: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పది రోజుల గణేష్ చతుర్థి వేడుక ముగింపుకు వచ్చింది. వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్నే అనంత చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజునే భక్తులు విఘ్నకర్తను గంగమ్మ ఒడికి చేర్చుతారు. గణేశుడికి వీడ్కోలు పలకే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు సహజం. నిమజ్జన సమయంలో చేసే పొరపాట్లు మీ జీవితాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఆ దేవుడి వీడ్కోలు కార్యక్రమం నియమ నిష్టలతో ఆచరించాలి. ఇలా చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. గంగమ్మ ఒడికి విష్నేుశ్వరుడిని చేర్చే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.

ఈ తప్పులు అస్సలు చేయకండి..

గణేశుడి విగ్రహాలను నేరుగా నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది. నిమజ్జన సమయంలో విగ్రహం పగలగుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే విరిగిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అశుభకరంగా భావిస్తారు. విగ్రహాన్ని నేరుగా నీటిలో కలపకూడదు. ముందుకు ఐడల్ ను నీటిలో మూడు సార్లు ముంచి అప్పుడు నెమ్మదిగా నీటిలో విగ్రహాన్ని విడిచి పెట్టండి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మాంసం ముట్టుకోకూడదు. ఈరోజున పూర్తిగా సాత్విక ఆహారాన్నే తీసుకోండి. నిమజ్జనానికి ముందు గణపయ్యను భక్తితో పూజింతి హారతి పట్టండి. పూజా సామాగ్రిని విసిరేయకుండా..శుభ్రమైన ప్రదేశంలో లేదా పవిత్రమైన మెుక్క దగ్గర దానిని ఉంచండి. నిమజ్జనం ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. వచ్చే సంవత్సరం తిరిగి రమ్మనమని ఆహ్వానం పలుకుతూ వినాయకుడికి ఆహ్వానం పలుకుతూ వీడ్కోలు చెప్పండి.

Also Read: Anant Chaturdashi-2025లో అనంత చతుర్దశి ఎప్పుడు? పూజా విధానం, శుభ ముహూర్తం తెలుసుకోండి..

అనంత చతుర్దశి తేదీ, శుభ సమయం

ఈ ఏడాది అనంత చతుర్దశి శనివారం, 6 సెప్టెంబర్ 2025న జరుపుకోనున్నారు. చతుర్దశి తిథి సెప్టెంబర్ 6, 2025న తెల్లవారుజామున 3:12 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 7, 2025న ఉదయం 1:41 గంటలకు ముగుస్తుంది. అనంత చతుర్దశి రోజున భక్తులు రోజంతా వినాయకుడికి పూజలు చేయవచ్చు. పూజకు శుభ సమయం సెప్టెంబర్ 6న ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై. సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 1:41 గంటల వరకు కొనసాగుతుంది.

Also read: Naraka chaturdashi 2025-ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad