Sunday, October 6, 2024
HomeదైవంBanaganapalli: ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

Banaganapalli: ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

బనగానపల్లె పట్టణంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆరాధనోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పట్టణంలోని బ్రహ్మంగారి ప్రథమ పీఠం బ్రహ్మంగారి మఠం, శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం, రవ్వలకొండ క్షేత్రంపై కాలజ్ఞాన గుహల సమీపంలో వెలసిన శ్రీ వీరప్పయ్య దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడాయి.

- Advertisement -

వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామి వారు సజీవ సమాధి నిష్టవహించిన పవిత్రమైన రోజు స్వామి వారికి పంచామృతాభిషేకాలు, పల్లకి సేవ, మహాప్రసాద వితరణ కార్యక్రమాలను ఆయా దేవస్థానం, మఠాధికారులు ఘనంగా నిర్వహించారు.

ఆయా కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు, చిరంజీవి ఆచార్యులు, శ్రీ జ్ఞానేంద్రస్వామి, శ్రీ జ్ఞానేశ్వరి మాతా, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకుని రవ్వలకొండపై శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబదేవి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి 331 వ జీవసమాధి జ్ఞాపిక జెండాను ధ్వజస్తంబానికి ఎగురవేసి, మరో జెండాను మేళతాళాల మధ్య ఊరేగింపుగా జుర్రేరు గట్టున వెలసిన బ్రహ్మంగారి ప్రథమ పీఠమైన బ్రహ్మంగారి నేలమఠం వద్దకు తీసుకువచ్చి ద్వజస్తంభానికి ఎగురవేశారు. సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News