Tuesday, September 24, 2024
HomeదైవంBathukamma begins from today: ఈరోజు నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ

Bathukamma begins from today: ఈరోజు నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ

బొడ్డెమ్మ అంటే?

సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పం డుగ బతుకమ్మ ప్రకృతితో మనిషికి ఉండే సంబం ధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ బతుకమ్మ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసే పండుగ తెలంగాణ స్త్రీల హృదయం బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ గురించి అందరికీ సుపరి చితమే కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండు గను చేసుకోవడం పురాతన కాలం నుండి వస్తున్న సంప్రదాయం.
పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజి స్తారు. సుమంగళి భాగ్యం కోరుకునే ముతైదువలు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ బతుకమ్మ. గౌరీదేవి బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులకు మరియు బాలలకు సం తోషాన్నిస్తుంది. బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఒక దాని వెంట ఒకటి జరుపుకునేవే ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పండుగలు. రెండూ గౌరీదేవి రూపా లే రెండు పండుగల్లో పాటలు ఒకే విధంగా ఉం టాయి. బొడ్డెమ్మ పిల్లల పండుగ అయితే బతుకమ్మ పెద్దల పండుగ.
ఈ పండగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగ జరుపుకుంటాం.
మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ ఇండ్లకు చేరుతాయి. ధాన్యలక్ష్మి ఇంట్లో కలకలలాడుతుంది. రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంలో పెద్దలు నిమగ్నమై ఉంటారు వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు. ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు సంబురంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు.
వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగను జరుపుకుంటాం.
బొడ్డెమ్మ అనే పేరుకు బొట్టే, బొడప, బొటిమ, పొట్టి అని అర్థాలు. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్న దని అర్థం. ధాన్యపు కుప్ప మరియు ధాన్యపు రాశి అని కూడా చెప్పుకోవచ్చు.
పిల్లలందరూ పొద్దున్నే సుచిగా శుభ్రంగా తయా రై పాలు నీళ్లు పసుపు కుంకుమ పువ్వులు తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నీళ్లు చల్లి పసుపు కుంకు మను సమర్పించి పూలతో పూజించి అలంకరించి పుట్టకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, పుట్ట మన్నును తవ్వుకొని తీసుకొస్తారు. ఒక చెక్క పీటపై మూడు లేదా ఐదు లేదా తొమ్మిది దొంతరలు (మెట్లు)గా బొడ్డెమ్మను తయారు చేసి ఎర్ర మట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి గన్నేరు రుద్రాక్ష కట్ల కాకర బీర బంతి జాజిపూలతో అలంకరించి పైన శిఖరం ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టలు దానిపై ఉంచి తమలపాకులు, పసుపు గౌరమ్మను పెడతారు.
నేలపైన అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మ పీఠను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికెడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి తెచ్చిన పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టి చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలవబడే గౌరమ్మను భక్తితో పూజిస్తారు.
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్‌…
బిడ్డా లేందారూ కోల్‌…
నీ బిడ్డ నీల గౌరు కోల్‌…
నిత్య మల్లె చెట్టేసి కోల్‌…
నిత్య మల్లె చెట్టూకూ కోల్‌….
నిత్యా నీళ్లు పోసీ కోల్‌…
కాయలు పిందెళ్లు కోల్‌ …
ఘనమైనా కాతా కోల్‌…
కాయలన్నీ తెంపీ కోల్‌….
కడవల్లా పోసీ కోల్‌….
తెంపిన కాయళ్లూ కోల్‌…
బండికి కెత్తంగా కోల్‌….
పోయేనే ఆ బండీ కోల్‌…
ఐలోనీ దాకా కోలు….
ఐలోని మల్లన్నా కోల్‌ ….
పండ్లోయి ఈ పండ్లూ కోల్‌
ఏమి పండ్లో గానీ కోల్‌….
ఎంతో గుమ గుమా కోల్‌…
చూసేటోరే గానీ కోల్‌. ….
కొనేటోరు లేరూ కోల్‌….
ఆ నుండి ఆ బండీ కోల్‌….
కొమ్మాలా దాకా కోల్‌….

అంటూ పాట ఇలా సాగుతుంది. బొడ్డెమ్మ బిడ్డ పేరు నీల గౌరు ఆమె నిత్యమల్లె చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదిందట చెట్టు పెరిగి కాయలు పండ్లు ఘనంగా రాసిందట ఆ పండ్లన్నీ తెంపి యాదగిరి నృసింహ స్వా మికి ఐలోని మల్లన్నకు కొమ్మాల నరసింహ స్వామికి పంపించగా ఎవరు స్వీకరించలేదట. చివరకు వరం గల్‌ భద్రకాళి మాత తీసుకుందని తెలంగాణ ప్రాం తంలో ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో ఈ విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తలచుకుంటూ ఈ విధంగా పాడుకుంటాం.
రామాయణ భారత భాగవత ఘట్టాలు శివపార్వ తుల కళ్యాణం సీతారాముల కళ్యాణం ఘట్టాలకు సం బంధించిన కథలను పాటల రూపంలో మరియు చారి త్రక మహిళల జీవిత చరిత్రలను పాటల రూపంలో జానపదులు జానపదాలు పాడుతూ భక్తి శ్రద్ధలతో వేడుతూ చేసుకునే పండుగ బొడ్డెమ్మ.
ప్రతిరోజు ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి అటుకులు బెల్లం, కొబ్బరి నువ్వులు బెల్లం, మరియు పప్పు బెల్లం ప్రసాదాలను పంచుకుంటారు. ఇలా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించి చతుర్దశి నాడు సాయంత్రం యధావిధిగా బొడ్డెమ్మను పూజించి ప్రతిరోజు తలా పిడికెడు తెచ్చి కలశంలో పోసిన బియ్యంతో ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం సమ ర్పించి అందరూ కూడా ప్రసాదం తీసుకొని బొడ్డెమ్మ పీఠాన్ని నెత్తిన పెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. పసుపు గౌరమ్మను పిల్లలకు గంధం బొట్టు లేదా చెంపలకు పూస్తారు. పెద్దలైతే మంగళ సూత్రాలకు ధరిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బొడ్డెమ్మ పండగ ద్వారా పిల్లల్లో కలివిడి తనం, స్నేహపూరిత వాతావరణం మరియు సృజ నాత్మక శక్తిని వెలికి తీసి, చక్కటి ఆలోచనను మానసి కోలాసాన్ని పెంపొందించడానికి బొడ్డెమ్మ పండుగ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.

  • కొమ్మాల సంధ్య
    తెలుగు ఉపన్యాసకులు
    9154068272.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News