Saturday, November 23, 2024
HomeదైవంChagalamarri Chennakesava temple: 700 ఏళ్ల పురాతన ఆలయం చూద్దాం రండి

Chagalamarri Chennakesava temple: 700 ఏళ్ల పురాతన ఆలయం చూద్దాం రండి

అన్నమయ్య దంపతులు కూడా ఇక్కడికి దర్శనానికి వచ్చారు

అత్యంత పురాతన ఆలయాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నకేశవ ఆలయం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో పాత బస్టాండ్ లో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ఉండే దేవాలయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ ఆలయం. ఇక్కడి స్థల పురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంది.

- Advertisement -

అన్నమయ్య సందర్శించిన మందిరం

తిరుమల వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పంతో అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్ధయాత్రలకు బయలుదేరారు, ముందు తమ ఊరిలో చెన్నకేశవవుని సంకీర్తన అర్పించి మార్గంలో నందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముణ్ణి, కడప వెంకట రమణున్ని, చాగలమర్రి చెన్నకేశవున్ని దర్శించుకున్నారు, తరువాత నవ నరసింహ అహోబిల లక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారని చారిత్రక ఆధారాలున్నాయి.

1484-1503 మధ్య కాలంలో శ్రీ వెంకటేశ్వరునిపై 32 వేల సంకీర్తనలు చేసిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు చాగలమర్రి చెన్నకేశుడు అనే మకుటంలో సంకీర్తన రాసారు. తిరుమల మ్యూజియంలో కుడా చాగలమర్రి నమూనా శ్రీదేవీ భూదేవి సమేత చెన్నకేశవ నమూనా చూడవచ్చు. ఇప్పటికీ చాగలమర్రిలో చెన్నకేశవ ఆలయములో పొందుపరిచిన శాసనములో ఈ విషయం చూడచ్చు. ఇంకొక కధనం ప్రకారం అన్నమయ్య చెన్నకేశవ స్వామి పై ఆరు శృంగార కీర్తనలు ఆలపించాడు, “ఇచ్చలాని దానేను ఇన్నిటానీకు గుచ్చు లేమిటికిరా చేగలమర్రి చెన్నడు “(25-162) అని స్పష్టంగా పేర్కొన్నాడు.

మాఘమాస వైభవం..

ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయములో ఆలయ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక ఉత్సవములు జరుగుతున్నాయి. ఈ దేవాలయములో కళ్యాణ మండపములో వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఆలయ అధ్యక్షుడు ఎం. కొండయ్య ఆధ్వర్యంలో ఇవన్నీ సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News